హైదరాబాద్: 28°C
వార్తలు

సాంకేతిక లోపం.. పట్టాలు తప్పిన రైలు

మహానంద ఎక్స్‌ప్రెస్ రైలు పట్టాలు తప్పిన ఘటన బీహార్‌లో జరిగింది. సిగ్నలింగ్ వ్యవస్థలో లోపం కారణంగా ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు గుర్తించారు. లోపం కారణంగా ఆఫ్ లైన్ సిగ్నల్ చూపించడంతో ఆ రైలు ముందుకు కదలింది. 200 మీటర్ల వెళ్లగానే రైలు ఇంజిన్, SLR,H-1 కోచ్ చక్రాలు పట్టాలు తప్పాయి. దీంతో ఆ మార్గంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వెంటనే పునరుద్ధరణ పనులను చేపట్టారు.