ఢిల్లీ సత్యనికేతన్ సమీపంలో నాలుగు అంతస్తుల హాస్టల్ భవనం కూలిన ఘటనలో ఓ విద్యార్థి మృతి చెందాడు. మరో ఆరుగురిని శిథిలాల నుంచి బయటకు తీయగా.. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. భవనం కూలిన ప్రదేశంలో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నారు. ప్రమాద సమయంలో ఆ భవనంలో 50 మంది విద్యార్థులు ఉన్నట్లు తెలుస్తోంది.
వార్తలు
కూలిన హాస్టల్ భవనం.. ఒకరు మృతి


