హైదరాబాద్: 28°C
తెలంగాణ

సంబరాలు నిర్వహించిన కాంగ్రెస్ నాయకులు

KMM: వైరాలో కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల అభివృద్ధి పాలన సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ ఇవాళ విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సారధ్యంలో తెలంగాణ రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందిందని అన్నారు. అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుందని వివరించారు.