హైదరాబాద్: 28°C
తెలంగాణ

లోటు వర్షపాతంతో రైతుల్లో ఆందోళన

NRML: ముధోల్ నియోజకవర్గంలో లోటు వర్షపాతంతో సోయా, పత్తి రైతులు ఆందోళన చెందుతున్నారు. సోయా కాయల్లో గింజలు తయారయ్యే దశలో వర్షం లేకపోవడంతో దిగుబడిపై ప్రభావం పడే అవకాశం ఉంది. కుబీర్, తానూరులో 36 శాతం, ముధోల్, బైంసా, కుంటాలలో 21 శాతం, లోకేశ్వరంలో 11 శాతం లోటు వర్షపాతం నమోదైంది. సాగునీటి సౌకర్యం ఉన్న రైతులు విద్యుత్ సరఫరా సక్రమంగా లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.