హైదరాబాద్: 28°C
తెలంగాణ

యువత రాజకీయాల్లో పాల్గొనాలి: ఎమ్మెల్సీ మల్లన్న

WGL: సమాజంలో మార్పు తీసుకురావాలంటే యువత రాజకీయాల్లో చురుగ్గా పాల్గొనాలని ఎమ్మెల్సీ తీన్మార్‌ మల్లన్న అన్నారు. ఉమ్మడి వరంగల్‌ జిల్లాకు చెందిన పలువురు యువత ఆయన సమక్షంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీలో ఆదివారం చేరారు. యువత ఆశయాలు, లక్ష్యాలు, ఆకాంక్షలకు అనుగుణంగా పార్టీ సిద్ధాంతాలు, కార్యాచరణ రూపొందించామని మల్లన్న తెలిపారు.