NRPT: కొత్తపల్లి మండలంలోని పలు గ్రామాల్లో డబుల్ రోడ్డు నిర్మాణ పనులకు ప్రభుత్వం రూ.59.30 కోట్ల నిధులు విడుదల చేసింది. మద్దూర్-భూనీడు మీదుగా గోకుల్‌నగర్, మద్దూర్-లింగల్చెడు మార్గాల్లో పనులకు నిధులు మంజూరైనట్లు మండల అధ్యక్షుడు మహేందర్ రెడ్డి తెలిపారు. మండల అభివృద్ధికి నిధులు కేటాయించిన ముఖ్యమంత్రికి ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు.
తెలంగాణ
రోడ్ల అభివృద్ధికి భారీ నిధులు


