హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రోడ్డు ప్రమాదంలో యువకుడు దుర్మరణం

VZM: కొత్తవలస ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. సింహాచలం డిపోకు చెందిన బస్సు తుమ్మికాపల్లి వైపు వెళ్తున్న ఓ వ్యక్తిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడిని కొత్తవలస సంత మార్కెట్‌కు చెందిన బోని వెంకటేష్‌గా పోలీసులు గుర్తించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఎస్.కోట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.