హైదరాబాద్: 28°C
తెలంగాణ

బోనాల వేడుకల్లో పాల్గొన్న ఎస్సై

KMM: మధిర పట్టణంలో ఆదివారం ముత్యాలమ్మ తల్లి బోనాలు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో మధిర టౌన్ ఎస్సై నవిత పాల్గొని బోనం ఎత్తుకున్నారు. ఈ వేడుకల్లో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని బోనాలను ఎత్తుకొని ఊరేగింపుగా వెళ్లి ముత్యాలమ్మ తల్లికి బోనాలు సమర్పించారు. వర్షాలు విస్తారంగా కురిసి పాడిపంటలతో సుఖశాంతులతో ఉండాలని అమ్మవారిని ప్రజలు కోరుకున్నారు.