ADB: ఇచ్చోడ మండలంలోని పలు గ్రామాల్లో వర్షాలు లేక పత్తి, సోయాబీన్, కందుల పంటలు ఎండిపోతున్నాయి. పంటలు కీలక దశలో ఉండటంతో నీరు అందక రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే ఎల్ నినో ప్రభావం ఖరీఫ్ పంటలపై పడే అవకాశం ఉందన్న నివేదికలు మరింత కలవరపెడుతున్నాయి. వర్షాలు కురిస్తేనే పంటలు బతికే పరిస్థితి ఉందని రైతులు చెబుతున్నారు.
తెలంగాణ
వర్షాలు రాకపోవడంతో రైతుల ఆవేదన


