హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గోతులమయంగా మారిన రోడ్డు

VZM: మెరకముడిదాం మండలం గరివిడి రోడ్డు గర్భం నుంచి పెదబంటుపల్లి వరకు గోతులమయంగా మారింది. రోడ్డుపై పెద్దపెద్ద గోతులు ఏర్పడడంతో రాకపోకలకు వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గోతులలో వాహనాలు దిగడంతో వాహనాలు పాడైపోతున్నాయని వాపోతున్నారు. రోడ్డు బాగు చేసేందుకు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ యంత్రాంగాన్ని ప్రజలు కోరుతున్నారు.