హైదరాబాద్: 28°C
వార్తలు

కూలిన హాస్టల్ భవనం.. ఆరుగురు సురక్షితం

ఢిల్లీ సత్యనికేతన్ ప్రాంతంలో హాస్టల్ భవనం కూలిన విషయం తెలిసిందే. ఈ శిథిలాల చిక్కుకున్న ఆరుగురిని సహాయక బృందాలు రక్షించాయి. అలాగే ముందస్తు జాగ్రత్తలో భాగంగా పక్కనున్న భవనాల్లో ఉన్న వారిని పోలీసులు ఖాళీ చేయిస్తున్నారు. ఈ ఘటనపై సీఎం రేఖా గుప్తా విచారం వ్యక్తం చేశారు. ఘటనాస్థలంలో సహాయక చర్యలను ముమ్మరం చేయాలని ఆదేశించారు.