హైదరాబాద్: 28°C
తెలంగాణ

'ప్రత్యేక వార్డు ఏర్పాటు చేయాలి'

WGL: సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి నూతన భవనంలో హిమోఫిలియా రోగుల కోసం ప్రత్యేక వార్డు, చికిత్సా కేంద్రం ఏర్పాటు చేయాలని హిమోఫిలియా సొసైటీ వరంగల్‌ చాప్టర్‌ కోరింది. 24గంటల వైద్యులు, నర్సింగ్‌ సిబ్బంది, క్లాటింగ్‌ ఫ్యాక్టర్‌ ఇంజెక్షన్లు అందుబాటులో ఉంచాలని విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు ప్రతినిధులు ఆస్పత్రి సూపరింటెండెంట్‌ రాంకుమార్‌కు వినతిపత్రం అందజేశారు.