హైదరాబాద్: 28°C
తెలంగాణ

పంచాయతీలకు నిధులు విడుదల చేయాలి

VKB: చౌడాపూర్, మక్త వెంకటాపూర్ గ్రామ పంచాయతీల్లో నిధుల కొరతతో పారిశుద్ధ్య పనులు నిలిచిపోతున్నాయని బీఆర్‌ఎస్‌ నాయకులు ఆరోపించారు. చెత్త సేకరణ ట్రాక్టర్ల డీజిల్‌, కార్మికుల వేతనాలు, తాగునీరు, వీధిదీపాల నిర్వహణకు నిధులు లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. ప్రభుత్వం వెంటనే నిధులు విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు.