ASR: పాడేరు ఐటీడీఏ పీవో ఆదిత్య వర్మను ఆదివారం కరాటే చీఫ్ ఇన్‌స్ట్రక్టర్ పాండురాజు, ఇన్‌స్ట్రక్టర్ దీప్తిక కలిశారు. ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించారు. శ్రీకృష్ణాపురం, గుత్తులపుట్టు బాలికల ఉన్నత పాఠశాలల్లో విద్యార్థులకు ఇస్తున్న కరాటే శిక్షణ పురోగతిని గురించి వివరించారు. గిరిజన బాలికలకు ఆత్మరక్షణ విద్యను అందించేలా ప్రోత్సహిస్తున్న పీవోకు కృతజ్ఞతలు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
'ఆత్మరక్షణ విద్య అందేలా ప్రోత్సాహం'


