NRPT: మక్తల్ పట్టణంలో ఈ నెల 10వ తారీఖున ఏర్పాటు చేయనున్న చాకలి ఐలమ్మ విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను ఆదివారం మంత్రి వాకిటి శ్రీహరి తన క్యాంపు కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. వీరనారి చాకలి ఐలమ్మ ధైర్యసాహసాలు, పోరాట స్ఫూర్తి నేటి తరానికి ఆదర్శమని, విగ్రహ ప్రతిష్ఠను ఘనంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు.
తెలంగాణ
ఐలమ్మ విగ్రహ ప్రతిష్ఠ పోస్టర్ ఆవిష్కరణ


