MNCL: ఫర్టిలైజర్ షాప్ యజమాని పంట మందు మార్చి ఇవ్వడంతో తాము సాగు చేసే వరి పంట నష్టపోయామని కన్నెపల్లి మండలం జజ్జరవెల్లి గ్రామానికి చెందిన రైతు కిష్టయ్య ఆరోపించారు. ఈ మేరకు సదరు ఫర్టిలైజర్ షాప్ ఎదుట ఆదివారం కుటుంబ సభ్యులతో కలిసి నిరసన తెలిపారు. షాప్ యజమానిని అడిగితే నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారని, వ్యవసాయ అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలన్నారు.
తెలంగాణ
ఫర్టిలైజర్ షాప్ ఎదుట రైతు నిరసన


