కడప జిల్లాలో నీరు లేక అడుగంటిన తెలుగు గంగ, ఎస్‌ఆర్-1, ఎస్‌ఆర్-2 ప్రాజెక్టులకు వెంటనే నీరు విడుదల చేయాలని రైతు సేవాసమితి డిమాండ్ చేసింది. ఈ మేరకు మైదుకూరు అంబేద్కర్ సర్కిల్‌లో రేపు ఉదయం 10 గంటలకు నిరసన చేపట్టనున్నట్లు జిల్లా అధ్యక్షుడు ఏవీ. రమణ తెలిపారు. రైతులు, ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
ఆంధ్రప్రదేశ్
నీటి కోసం మైదుకూరులో రేపు రైతుల నిరసన


