హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఏలూరు జిల్లాకు ఆరెంజ్ అలెర్ట్

ELR: రాగాల మూడు గంట్లో ఏలూరు జిల్లాలో పిడుగులతో కూడిన వర్షం కురవనుందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఈ క్రమంలో జిల్లాకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. నూజివీడు, ఆగిరిపల్లి, గన్నవరం, ఏలూరు పరిసర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. వర్షం, పిడుగుల సమయంలో అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లవద్దని అలర్ట్ చేసింది.