మధ్యప్రదేశ్‌లో కల్తీ మద్యం తాగి మృతి చెందిన వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఇప్పటివరకు 11 మంది మరణించినట్లు అధికారులు తెలిపారు. పలువురు బాధితులకు ఇంకా చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై కలెక్టర్, ఎస్పీ, ఉన్నతాధికారులు ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. మద్యం సేవించిన తర్వాత ఎవరికైన తలనొప్పి, వికారం, వాంతులు వంటి లక్షణాలు కనిపిస్తే సమాచారం ఇవ్వాలని కోరారు.
వార్తలు
11కి చేరిన మృతుల సంఖ్య


