ఐక్యరాజ్య సమితి ఆమోదించిన ప్రపంచ పటంకు మద్దతు తెలపడంపై భారత్ స్పందించింది. అన్ని ప్రాంతాలను సరిగ్గా చూపించడానికే భారత్ ఓటు వేసిందని తెలిపింది. భారత దేశ భూభాగాన్ని తప్పుదోవపట్టించేలా చూపిస్తే సహించేది లేదని విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జయస్‌వాల్ పేర్కొన్నారు. జమ్మూకాశ్మీర్, లద్దాఖ్ సహా ఇతర కేంద్ర పాలిత ప్రాంతాలను భారత అధికారిక మ్యాప్ ప్రకారమే చూపించాలని తెలిపారు.
వార్తలు
'భారత భూభాగాన్ని తప్పుగా చూపిస్తే సహించేది లేదు'


