BHPL: మహాముత్తారం.మండలంలోని బోర్లగూడెం గ్రామంలో ఆదివారం పిడుగుపాటుకు రైతు హట్కర్ రాజయ్యకు చెందిన ఎద్దు మృతి చెందింది. ఈ ఘటనలో సుమారు రూ.70 వేల నష్టం వాటిల్లినట్లు రైతు తెలిపారు. వ్యవసాయ పనులకు ఉపయోగపడే ఎద్దు మృతి చెందడంతో తీవ్రంగా నష్టపోయానని, ప్రభుత్వం ఆర్థిక సాయం అందించి ఆదుకోవాలని రాజయ్య కోరారు.
తెలంగాణ
పిడుగుపాటుకు ఎద్దు మృతి!


