హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆయిల్ ఫామ్ రైతులకు అవగాహన సదస్సు

మహబూబాబాద్ ఆర్తీ గార్డెన్‌లో ఫార్మర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆయిల్‌ఫామ్ రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఆయిల్‌ఫామ్ సాగులో ఆధునిక పద్ధతులు, మొక్కల సంరక్షణ, ఎరువులు, నీటి యాజమాన్యం, తెగుళ్ల నివారణ, మార్కెటింగ్‌పై రైతులకు అవగాహన కల్పించారు. ప్రారంభంలో మూడేళ్లు శ్రద్ధగా సాగు చేస్తే 27 ఏళ్లపాటు దిగుబడితో మంచి ఆదాయం పొందవచ్చన్నారు.