హైదరాబాద్: 28°C
వార్తలు

కాంగ్రెస్‌లో సంక్షోభం మొదలైంది: జగదీష్ రెడ్డి

TG: కాంగ్రెస్‌లో కొండా సురేఖతో సంక్షోభం మొదలైందని మాజీమంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. తమ పదవులు కూడా పోతాయనే భయం శ్రీధర్ బాబు, పొన్నంకు మొదలైందని ఎద్దేవా చేశారు. 'సరైన సమయానికి కేసీఆర్ అసెంబ్లీకి వస్తారు. పేదల మనసుల్లో ఆయన ఉన్నారు. సీఎం, మంత్రుల గుండెల్లో కేసీఆర్ నిద్రపోతున్నారు. కేసీఆర్ రాజీనామా అడుగుతున్నారంటేనే.. కాంగ్రెస్ నేతలకు భయమవుతుందని అర్థం' అని పేర్కొన్నారు.