హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ఇళ్లకు తాళాలు వేసేటప్పుడు జాగ్రత్తలు తప్పనిసరి'

W.G: మహిళలు, చిన్నారుల భద్రతపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని తణుకు రూరల్ SI శ్రీనివాసరావు సూచించారు. తణుకు మండలం వేల్పూరులోని సెయింట్ పాల్స్ లూథరన్, పెంతుకోస్తు చర్చిల్లో పోలీసుల ఆధ్వర్యంలో సదస్సు నిర్వహించారు. సైబర్ నేరాలు, ఆన్‌లైన్ మోసాలు, పోక్సో చట్టంపై వివరించారు. ఇళ్లకు తాళాలు వేసి బయటకు వెళ్లే సమయంలో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని SI కోరారు.