హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ట్రాఫిక్ సమస్యలపై ప్రత్యేక ఆంక్షలు విధించాలి'

కోనసీమ: మండపేట పట్టణంలో పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని బీజేపీ నాయకులు కోన సత్యనారాయణ కోరారు.పట్టణంలోని నాలుగు ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్ సిగ్నల్ లైట్లు ఏర్పాటు చేయాలని సూచించారు. భారీ వాహనాలను బైపాస్‌ల మీదుగా మళ్లించడంతో పాటు మైనర్లు వాహనాలు నడపకుండా అవగాహన కల్పించాలని కోరారు.