హైదరాబాద్: 28°C
తెలంగాణ

రోడ్డు కోసం నాలుగేళ్ల నిరీక్షణ

GDWL: రాజోలి మండలంలోని మాన్‌దొడ్డి–తుమ్మిళ్ల రహదారి నాలుగేళ్లుగా కంకర రోడ్డుగానే ఉండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మండలకేంద్రానికి చేరుకునేందుకు మాన్‌దొడ్డి, నసనూరు, చిన్నధన్వాడ, పెద్దధన్వాడ గ్రామాల ప్రజలకు ఇదే సమీప మార్గం. రోడ్డుపై గుంతలు, కంకరతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు వాపోతున్నారు. ఉన్నతాధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని సూచించారు.