WGL: నల్లబెల్లి(M)నందిగామ ప్రభుత్వ ఆరోగ్య ఉపకేంద్రం ఆవరణలో బోరుబావి తెరిచి ఉండటం ఆందోళనకు గురిచేస్తోంది. బోరు పైపును ఇనుప మూతతో మూసివేయాల్సి ఉండగా, గుడ్ల ట్రేలు, బండరాయితో తాత్కాలికంగా కప్పి ఉంచినట్లు స్థానికులు తెలిపారు. కేంద్రానికి చిన్నారులు, గర్భిణీలు వస్తుంటారని ప్రమాదం జరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే అధికారులు స్పందించాలన్నారు
తెలంగాణ
ఆరోగ్య ఉపకేంద్రం వద్ద ప్రమాదకర బోరుబావి


