హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రేపు ఆముదార్లంకలో అభివృద్ధి పనులు ప్రారంభం

కృష్ణా: చల్లపల్లి మండలం ఆముదార్లంకలో ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ సోమవారం ఉదయం పలు అభివృద్ధి పనులు ప్రారంభించనున్నారు. పల్లె పండుగ-1లో రూ.85.70 లక్షలతో నూతనంగా నిర్మించిన 1.45 కిలోమీటర్ల ఏడు సీసీ రోడ్లు ప్రారంభిస్తారు. ఎస్సీ కాలనీలో మండల పరిషత్ 15వ ఆర్థిక సంఘం నిధులు రూ.9 లక్షలతో నిర్మించిన నూతన మంచినీటి పైప్ లైన్ ప్రారంభిస్తారు.