ELR: జంగారెడ్డిగూడెంలో అక్రమంగా మత్తు ఇంజెక్షన్లు విక్రయిస్తున్న మెడికల్ ఏజెన్సీ నిర్వాహకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. జంగారెడ్డిగూడెం డిఎస్పి వెంకటేశ్వర్లు ఆదివారం స్టేషన్‌లో వివరాలు వెల్లడించారు. పక్కా సమాచారంతో దాడులు నిర్వహించి డాంగే నగర్‌లోని ఒక వర్క్‌షాప్‌లో దాచిన 7,550 ఇంజెక్షన్లను పోలీసులు స్వాధీనం చేసుకొని కేసు దర్యాప్తు చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
మెడికల్ నిర్వాహకుడు అరెస్ట్


