హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఆదోనిలో రౌడీషీటర్లకు కౌన్సెలింగ్

KRNL: ఆదోనిలో 2 టౌన్ సీఐ రాజశేఖర్‌రెడ్డి ఆదివారం రౌడీషీటర్లకు కౌన్సెలింగ్ నిర్వహించారు. అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండి, కోర్టులో నమోదైన కేసులకు సక్రమంగా హాజరుకావాలని సూచించారు. ఇతరులతో గొడవలకు దూరంగా ఉంటూ సత్ప్రవర్తనతో ఉండాలని సూచించారు. అలా ఉండే వారి పేర్లను రౌడీ షీట్ నుంచి తొలగిస్తామని సీఐ తెలిపారు.