హైదరాబాద్: 28°C
తెలంగాణ

లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోండి: SI

MHBD: కొత్తగూడ మండల ప్రజలు రాజీకి అవకాశం ఉన్న కేసులను లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించుకోవాలని కొత్తగూడ ఎస్సై ఈ. రాజ్‌కుమార్ సూచించారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 12న జిల్లా కోర్టులో లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు తెలిపారు. చిన్న వివాదాలు శత్రుత్వాలకు దారితీయకుండా ఇరువర్గాలు రాజీమార్గంలో కేసులు పరిష్కరించుకోవాలని కోరారు