హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మహిళలకు ఉచితంగా ట్యాక్స్, జీఎస్టీ శిక్షణ

SS: పుట్టపర్తి మేడ గెస్ట్ హౌస్‌లో కెనరా బ్యాంక్ సహకారంతో 38 మంది మహిళలకు ఉచిత ట్యాక్స్, జీఎస్టీ శిక్షణ తరగతులను శ్రీ సత్యసాయి ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ రత్నాకర్ ప్రారంభించారు. మహిళల ఆర్థిక పురోగతికి త్వరలో జిల్లాలో శాశ్వత స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో జాతీయ సేవా కోఆర్డినేటర్ కోటేశ్వర పాల్గొన్నారు.