హైదరాబాద్: 28°C
తెలంగాణ

కాంగ్రెస్ నాయకుడి కుటుంబానికి పరామర్శ

MHBD: కేసముద్రం మండలంలోని ఉప్పరపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తిరుగుడు వీరాస్వామి మాతృమూర్తి బక్కమ్మ అనారోగ్యంతో మరణించారు. విషయం తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు చిలువేరు సమ్మయ్య గౌడ్ వారి పార్థివదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మృతురాలి కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రగాఢ సానుభూతి తెలిపారు.