హైదరాబాద్: 28°C
తెలంగాణ

యశస్విని రెడ్డికి మంత్రి పదవి..?

JN: తెలంగాణ మంత్రివర్గంలో ఖాళీ అయిన స్థానాన్ని ఎవరితో భర్తీ చేస్తారనే అంశంపై కాంగ్రెస్‌ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. ఉమ్మడి వరంగల్‌ జిల్లాకు చెందిన కొండా సురేఖ మంత్రివర్గం నుంచి వైదొలగడంతో ఏర్పడిన ఖాళీపై చర్చ సాగుతోంది. ఈ నేపథ్యంలో పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి పేరు మంత్రి పదవికి పరిశీలనలో ఉన్నట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.