హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఉద్యమ సహచరుడిని కోల్పోయా : ఎమ్మెల్యే

MBNR: ఒక మంచి ఉద్యమ సహచరుడిని కోల్పోయానని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస రెడ్డి అన్నారు. రోడ్డు ప్రమాదంలో తెలంగాణ ఉద్యమకారుడు పల్లె రవి శనివారం రాత్రి మృతి చెందారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డి రవి నివాసానికి చేరుకుని ఆయన భౌతిక గాయానికి పూలమాలలతో ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి అండగా ఉంటానన్నారు.