హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: అండర్‌పాస్ పనులను అడ్డుకున్న భూయజమాని

KNR :శంకరపట్నం మండలం కొత్తగట్టు గ్రామంలో అండర్‌పాస్ పనులను భూయజమాని ఆదివారం అడ్డుకున్నారు. కొత్తగట్టు, గొల్లపల్లి ప్రజలు ఎన్‌హెచ్‌-563 రహదారి దాటేందుకు చేపట్టిన అండర్‌పాస్ దారి తన భూమి నుంచి వెళ్తుందని పేర్కొంటూ పనులు నిలిపివేయించారు. దీంతో గ్రామస్థులు చేరుకుని దారి ఇవ్వాలని కోరారు. భూమికి పరిహారం అందేలా చూస్తామని తెలిపారు.