హైదరాబాద్: 28°C
వార్తలు

నేడు ఉద్యోగుల జేఏసీ 'చలో హైదరాబాద్'

TG: పీఆర్సీ, పెండింగ్ డీఏలతో పాటు ఇతర సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ఉద్యోగుల జేఏసీ నేడు 'చలో హైదరాబాద్' కార్యక్రమానికి పిలుపునిచ్చింది. ఇందులో భాగంగా నాంపల్లిలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో భారీ సభను నిర్వహించనున్నారు. తమ డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు రాష్ట్ర నలుమూలల నుంచి పెద్ద ఎత్తున ఉద్యోగులు ఈ సభకు తరలిరానున్నట్టు తెలుస్తోంది.