హైదరాబాద్: 28°C
తెలంగాణ

కుటుంబ బాధ్యతల భారంతో యువకుడి ఆత్మహత్య

BHPL: చిట్యాల మండలం పాసిగడ్డతండాలో కుటుంబ బాధ్యతల భారంతో భూక్యా తిరుపతి (22) ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తల్లిదండ్రులు మృతి చెందడంతో ముగ్గురు తోబుట్టువుల బాధ్యత తిరుపతిపై పడింది. చదువు మానేసి కూలీ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్న అతను ఆర్థిక ఇబ్బందులతో శనివారం మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై సతీశ్ తెలిపారు.