JN: జనగామ మండలంలోని పలు గ్రామాల్లో వ్యవసాయ బావుల వద్ద బోరు మోటార్లు, ట్రాక్టర్ బ్యాటరీల చోరీలకు పాల్పడిన నలుగురు నిందితులను శనివారం పోలీసులు అరెస్టు చేశారు. నలుగురిని అదుపులోకి తీసుకుని విచారించగా 13 బోరు మోటార్లు, 4 ట్రాక్టర్ బ్యాటరీలు దొంగిలించినట్లు ఒప్పుకున్నారు. వారిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ సత్యనారాయణ రెడ్డి తెలిపారు.
తెలంగాణ
బోరు మోటార్లు చోరీ కేసులో నలుగురు అరెస్ట్


