GDWL: అలంపూర్‌లోని ఉపాధి హామీ భవనంలో డీఆర్‌డీవో అధికారి ముషాహిదా బేగం ఆధ్వర్యంలో శనివారం 16వ సామాజిక తనిఖీ నిర్వహించారు. మండలంలోని 14 గ్రామాల్లో రూ.2కోట్ల 86 లక్షల 625 విలువైన పనుల వివరాలను పరిశీలించారు. గ్రామాల్లో చేపట్టే పనులకు గ్రామ తీర్మానం తప్పనిసరిగా చేయాలని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీడీవో చంద్రకళ, ఇతర అధికారులు పాల్గొన్నారు.
తెలంగాణ
అలంపూర్‌లో 16వ సామాజిక తనిఖీ


