హైదరాబాద్: 28°C
తెలంగాణ

వ్యవసాయ బావిలో పడి రైతు మృతి

KNR: కరీంనగర్ గ్రామీణ మండలం చామనపల్లిలో శనివారం ప్రమాదవశాత్తు వ్యవసాయ బావిలో పడి బొజ్జ లచ్చపోచయ్య (55) అనే రైతు మృతి చెందారు. పొలానికి నీరు పెట్టేందుకు బావి వద్దకు వెళ్లిన లచ్చపోచయ్య ప్రమాదవశాత్తు కాలు జారి బావిలో పడిపోయారు. ఆయనకు భార్య రాజేశ్వరీ, కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.