హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఫారెస్ట్ కార్యాలయంలో క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమం

BDK: భద్రాచలం ఫారెస్ట్ డివిజన్ కార్యాలయంలో శనివారం క్లీన్ అండ్ గ్రీన్, శ్రమదానం కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యాలయ పరిసరాల్లో పచ్చదనం పెంపొందించేలా పలు చర్యలు చేపట్టారు. ఫారెస్ట్ డివిజన్ అధికారి నిషా ఎన్ఎస్ పర్యవేక్షణలో అటవీశాఖ అధికారులు, సిబ్బంది కార్యాలయ పరిసరాలను శుభ్రం చేశారు. పేరుకుపోయిన చెత్తను తొలగించి, మొక్కలకు నీరు పోశారు.