KMR: రాజంపేట మండల కేంద్రంలోని ఓ ప్రాంతంలో పేకాట ఆడుతున్న ముగ్గురిని పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి రూ.14,050 నగదు, ఒక బైక్, మూడు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు రాజంపేట ఎస్సై భవనేశ్వర్ తెలిపారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. పేకాట, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.
తెలంగాణ
పేకాట స్థావరంపై పోలీసుల దాడి


