హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నీటి సమస్యను పరిష్కరించాలని ఎంపీడీవోకి వినతి

NLR: అనంతసాగరం మండలంలోని పడమటి కంభంపాడు గిరిజన కాలనీ నందు మంచినీటి సమస్యతో గిరిజనులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యను పరిష్కారం చేయాలనీ సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో గిరిజనులు ఎంపీడీవో ఐజాక్ ప్రవీణ్‌కి శనివారం వినతిపత్రం అందజేశారు అందజేశారు. గిరిజన కాలనిలో ఇంకొక బోరు మంజూరు చేసి కొత్త బోరు వేయాలనన్నారు. సమస్యను త్వరగా పరిష్కరించాలన్నారు.