హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఆధార్ క్యాంపులు ఏర్పాటు చేయాలని వినతి

NLR: సంగం మండలంలోని జంగాలకండ్రిగ, మర్రిపాడు, వంగల్లు గ్రామాల్లో ఆధార్ కార్డు సమస్యలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆధార్ క్యాంపులు ఏర్పాటు చేయాలని టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి విజయ్ చంద్ర కోరారు. శనివారం నెల్లూరు ఆధార్ సెంటర్ మేనేజర్ దిలీప్ కుమార్‌ను కలిసి వినతి పత్రం అందజేశారు. మంత్రి ఆనం రామనారాయణరెడ్డి సహకారంతో త్వరలో క్యాంపు ఏర్పాటు చేస్తామన్నారు.