AKP: దేవరాపల్లి మండలం సరియా జలపాతంలో శనివారం ఘోర ప్రమాదం జరిగింది. విజ్ఞాన కళాశాలకు చెందిన ఆరుగురు ఇంజినీరింగ్ విద్యార్థులు జలపాతాన్ని సందర్శించడానికి వెళ్లగా, వారిలో ముగ్గురు ఈత కోసం నీటిలోకి దిగారు. ఈ క్రమంలో కూర్మానపాలెం గ్రామానికి చెందిన ఫణి కుమార్(20) ప్రమాదవశాత్తు గల్లంతయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
ఆంధ్రప్రదేశ్
విషాదం.. జలపాతంలో విద్యార్థి గల్లంతు


