ప్రకాశం: కనిగిరి పట్టణంలో కొలువైన శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో స్వామివారి పల్లకి సేవ కార్యక్రమాన్ని వేద పండితుల ఆధ్వర్యంలో శనివారం వైభవంగా నిర్వహించారు. భక్తులు ఆలయానికి తరలివచ్చి స్వామివారి పల్లకినీ స్వయంగా మోసి, కొబ్బరికాయలు కొట్టి, హారతులు పట్టి, పూజలు చేశారు. భక్తులకు ఆశీర్వచనాలు అందజేసిన పండితులు స్వామివారి తీర్థప్రసాదాలను పంపిణీ చేశారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: వైభవంగా శ్రీ లక్ష్మీనరసింహస్వామి పల్లకి సేవ


