హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎస్సీ, ఎస్టీల సంక్షేమ సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే

ATP: సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన రాష్ట్రస్థాయి అత్యున్నత కమిటీ సమావేశంలో ఎమ్మెల్యే బండారు శ్రావణి పాల్గొన్నారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల విచారణ వేగవంతం చేసి బాధితులకు త్వరితగతిన న్యాయం చేయాలని సీఎం ఆదేశించారు. ప్రత్యేక కోర్టుల ద్వారా కేసులు పరిష్కరించి పరిహారం, ఇళ్ల స్థలాలు అందించాలన్నారు. జిల్లాల్లో కేసులపై అధ్యయనం చేయాలని సూచించారు.