హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ఏ పనికైనా ఏడాదే టార్గెట్'

ELR: ఎంపీ ల్యాడ్స్ పనులు వేగవంతం చేయాలని, మంజూరు చేసిన ఏడాదిలోపు పూర్తి చేయాలని ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ అధికారులను ఆదేశించారు. శనివారం ఏలూరులో ఎంపీ కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. గత రెండేళ్లలో మంజూరు చేసిన కొన్ని పనులు ఇంకా పూర్తి కాకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. బీసీ వెల్ఫేర్ హాస్టల్ నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు.