KDP: మైదుకూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో JBVS, NSS, RRCల సంయుక్త ఆధ్వర్యంలో శనివారం రక్తదాన శిబిరం నిర్వహించారు. ప్రిన్సిపల్ డా. పి.నారాయణరెడ్డి ఆధ్వర్యంలో విద్యార్థులు, అధ్యాపకులు స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. ఒకరి రక్తదానంతో ముగ్గురి ప్రాణాలు కాపాడవచ్చని JBVS వ్యవస్థాపకులు ఎం.అశోక్ తెలిపారు. కార్యక్రమంలో NSS, RRC కోఆర్డినేటర్లు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
మైదుకూరులో రక్తదాన శిబిరం


